![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -23 లో......నర్మదని తీసుకొని వెళ్ళడానికి సాగర్, ధీరజ్ లు నర్మద ఇంటి ముందు వెయిట్ చేస్తుంటారు. అప్పుడే నర్మద పేరెంట్స్ తనని షాపింగ్ కి తీసుకొని వెళ్తారు. దాంతో మమ్మల్ని ఫాలో అవ్వండి అంటూ సాగర్ కి నర్మద మెసేజ్ చేస్తుంది.. మరొకవైపు వేదవతి తన తమ్ముడు మాట్లాడుకుంటారు. ఈ రోజు ఎందుకో అల్లుల్లు ఇద్దరు తేడాగా ఉన్నారని అనగానే ఎందుకని వేదవతి అంటుంది.
చిన్నోడికి కాలేజీ లో ప్రోగ్రాం ఉంటే.. నడిపోడు ఎందుకు బావ దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాడు. వాళ్లు ఏదో చేయబోతున్నరని అతను అనగానే.. అలా ఏదైనా చేస్తే కుటుంబంలో గొడవలు అవుతాయని వేదవతి టెన్షన్ పడుతుంది. మరొక వైపు నర్మద వాళ్ల కుటుంబంతో కలిసి జ్యువలరీ షాపింగ్ కి వెళ్తారు. వాళ్ళ వెనకాలే సాగర్, ధీరజ్ లు వెళ్తారు. నర్మదకి జ్యువలరీ తన పేరెంట్స్ తీసుకుంటారు. ఆ తర్వాత అక్కడికి ప్రేమ వస్తుంది. ధీరజ్ సాగర్ లని చూసి మీరేంటి ఇక్కడ అని వాళ్ళతో డౌట్ గా మాట్లాడుతుంది. ఆ తర్వాత షాపింగ్ పూర్తి చేస్తారు. తాళిని నా దగ్గర ఉంచుకుంటానని నర్మద తాళి తీసుకుంటుంది. ఆ తర్వాతనే సాగర్ ని ఫోన్ చెయ్యమని నర్మద మెసేజ్ చేస్తుంది. సాగర్ ఫోన్ చెయ్యగానే లిఫ్ట్ చేసి ఆఫీస్ నుండి ఫోన్ వచ్చినట్లు మాట్లాడుతుంది. ఇక ఆఫీస్ ల వర్క్ ఉంది.. మీరు వెళ్ళండి నేను వస్తానని నర్మద తన పేరెంట్స్ కి చెప్తుంది.
ఆ తర్వాత ప్రేమ తన ఫ్రెండ్స్ అందరు జ్యూస్ తాగుతారు. వాళ్ళ దగ్గరే సాగర్, ధీరజ్ లు ఉంటారు. వీళ్ళు వెళ్లాక మనం నర్మదని తీసుకొని వెళదాం.. లేదంటే దీనికి డౌట్ వస్తుందని ధీరజ్ అంటాడు. తరువాయి భాగంలో సాగర్, ధీరజ్ లు నర్మదని తీసుకొని వెళ్తుంటే రామరాజు కన్పిస్తాడు. ఏదో ఫోన్ మాట్లాడతాడు. వాళ్ళని ఎక్కడ చూస్తాడోనని భయపడుతుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |